clear
clear
clear
clear
x

బొమ్మాలికి బోలెడు పుట్టినరోజు శుభాకాంక్షలు!

  శనివారం, నవంబర్ 7, 2009, 12:24[IST]
Vote this article
Up  
Down  


పుట్టిన రోజు పండగే అందరికీ పెద్ద పండగగా భావిస్తూ పెద్ద హంగామాలు చేస్తూ ఉంటారు. అందులోనూ సినిమా తారలదంటే ఇంకాస్త గ్లామర్ గా ఉంటుంది. అభిమానుల శుభాకాంక్షలు పూల బొకేలూ ఆ హడావుడే వేరు. అందుకే వసంతానికి కనీసం రెండైనా వస్తే భావుణ్ణు అనిపిస్తుంది కానీ ఇటువంటి సంబరాలకు మన బొమ్మాలి అదేనండీ అనుష్క బహుదూరమట. టాలీవుడ్ సెక్సీక్వీన్ గా యోగా టీచర్ అనుష్క టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. శనివారం ఈ అందాల భామ పుట్టిన రోజు ఎలా జుపుకొంటున్నారని ప్రశ్నిస్తే. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఎప్పుడూ పుట్టిన రోజును భారీగా జరుపుకోలేదు. అమ్మ, నాన్న, అన్నయ్య, స్నేహితులు మాత్రం శుభా కాంక్షలు చెబుతుంటారు. లేనిపోని హంగామ అంతగా ఇష్టం ఉండదు’ అంటోంది. అనుష్క ‘వరద బాధితుల సహాయార్థం తెలుగు పరిశ్రమ నిర్వహిస్తున్న స్టార్ నైట్ కారణంగా మూడు రోజులు షూటింగ్ లు లేనందున ఇంటికి వెళ్లే చాన్స్ దొరికింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో గడిపి మధ్యాహ్నం మళ్లీ హైదరాబాద్ కు వచ్చేస్తా’ అంది. సో ఈ స్వీటీ శెట్టికి దట్స్ తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రజనీకాంత్
తేదీ: 07 Nov 2009 4:16 pm
అనుష్క ఐ లవ్ యు

[ Post Comments ]
  Other News
  Videos