clear
clear
clear
clear
x

వెంకటేష్ 'నమో వెంకటేశ' పై భారీ అంచనాలు

  శుక్రవారం, నవంబర్ 20, 2009, 12:05[IST]
Vote this article
Up  
Down  


సంక్రాంతి చిత్రాల ఆహ్లాదకరమైన హీరో వెంకటేష్ నటించిన "నమో వెంకటేశ" సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్‌, త్రిష జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్న ఈ చిత్రం 90శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ ‘‘ఇది చందమామ కథ లాంటి చక్కని వినోదాత్మక శృంగార ప్రేమకథా చిత్రం. అరుదైన కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఫోర్టీన్‌ రీల్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాం. సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘శ్రీను వైట్లతో చాలా కాలం నుంచి సినిమా చేయాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళకు అది తీరింది. ఇందులో నా పేరు పర్వతనేని వెంకట రమణ, వెంకటేశ్వరస్వామి భక్తుడుగా నటిస్తున్నాను. ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ తరువాత త్రిషతో ఈ సినిమా చేస్తున్నాను. వినోదాత్మక చిత్రాలు రూపొందించడంలో మాస్టర్‌ అయినటువంటి శ్రీను వైట్ల తనదైన శైలిలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు" అన్నారు. త్రిష మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌తోను, శ్రీను వైట్లతోను ఇది నా రెండవ సినిమా. పూర్తి వినోదాత్మకంగా వుంటుంది" అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘ఇందులో నేను ప్యారిస్‌ ప్రసాద్‌గా నటిస్తున్నాను.

వెంకటేష్‌ నా కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలు ఘనవిజయం సాధించాయి" అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ "వెంకటేష్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్‌ అనుకున్న వెంటనే ఇది వెంటేష్‌తోనే చేయాలని డిసైడ్‌ అయ్యాను. నా చిత్రాల్లో ఎక్కువ కాలం స్క్రిప్ట్‌ మీద కూర్చున్నది ఈ సినిమా విషయంలోనే. ఏ అంశమూ మిస్‌ కాకుండా అందరినీ అలరిస్తుంది" అన్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌ మరియు ఫోర్టీన్‌ రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్నారు.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...