clear
clear
clear
clear
x

శ్వేతాబసు, వైభవ్ 'కాస్కో' స్టోరీ లైన్

  శుక్రవారం, నవంబర్ 6, 2009, 9:59[IST]
Vote this article
Up  
Down  


పవిత్రమైన 'రామాయణం' నుంచి ప్రేరణ పొంది తయారుచేసిన కథ ఇది. సాధారణంగా చిత్రంలో విలన్‌లు హీరోను వెతుక్కుంటూ వస్తారు. కానీ ఈ కథలో హీరో..విలన్‌ కోసం వెతుక్కుంటూ వస్తాడు. విలన్‌కి ఆ విషయం తెలియదు. అసలు అతను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు అనేది కథాంశం. స్క్రీన్‌ప్లే ప్రధానాంశంగా కొనసాగే కథ ఇది. హీరో...విలన్‌ కి విసిరే సవాలే ఈ 'కాస్కో' కథాంశం.ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌. అంటున్నారు దర్శకులు నాగేశ్వరరెడ్డి తన తాజా చిత్రం గురించి మాట్లాడుతూ..

అలాగే ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరో పాత్రలో విభిన్నకోణాలు వుంటాయి. పాత్ర కూడా పూర్తి ఎనర్జీతో వుంటుంది. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో హీరో అమాయకంగా వుంటూనే తను చేయాల్సిన అన్ని పనులు చేస్తూనే వుంటాడు. ఇంటర్వెల్‌కు ముందు వీడు ఏంటి రా..బాబూ అనుకునే విధంగా టర్న్‌ తీసుకుంటుంది ఆ పాత్ర. ఇక సెకండాఫ్‌లో కొంత భాగం లవర్‌బాయ్‌గా, మరికొంత భాగం యాక్షన్‌ హీరోగా..ఇలా విభిన్నమైన షేడ్స్‌ వైభవ్‌ పాత్రలో వుంటాయి. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర రామాయణంలో హనుమంతుడిని తలపిస్తుంది. ఆద్యంతం నవ్వులు పండించే పాత్రను ఆయన పోషించారు అని చెప్పారు.

సిక్స్‌టీన్స్‌, గర్ల్‌ ఫ్రెండ్‌, సీమశాస్త్రి వంటి కామిడీ చిత్రాలను రూపొందించిననాగేశ్వరరెడ్డి తొలిసారిగా తన రూటు మార్చి 'కాస్కో' అంటూ ఈ స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. వైభవ్‌, శ్వేత బసుప్రసాద్‌ జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos