ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. సినిమా హక్కుల కొనుగోలు వివాదంలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై నగరంలోని పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. మలయాళంలో నిర్మించిన 'హలో' చిత్రాన్ని తెలుగులో 'నా స్టైలే వేరు' పేరుతో రీమేక్ చేయడానికి నిర్మాత జాయ్ థామస్ నుంచి పాండురంగారావు, నిర్మాత బెల్లంకొండ సురేష్ పూర్తి హక్కులను పొందారు. అందుకు వారు థామస్‌కు రూ.30 లక్షలు చెల్లించారు. తర్వాత ఆ చిత్రాన్ని నిర్మాత ప్రదీప్ చౌదరి, మాగంటి గోపినాథ్‌లకు అమ్మేందుకు బెల్లంకొండ సురేష్ బృందం థామస్ నుంచి రూ.45 లక్షలకు కొనుగోలు చేసినట్టు పేర్కొంటూ ఒప్పంద పత్రాన్ని చూపించారు.
ఆ మేరకు ప్రదీప్ చౌదరి బృందం ఆ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ప్రదీప్ చౌదరి.. థామస్‌ను కలవడంతో అసలు విషయం బయట పడింది. దాంతో తాము మోసపోయినట్టు గుర్తించి మలయాళ చిత్ర నిర్మాత థామస్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తాను మోసపోయానని నిర్మాత ప్రదీప్ చౌదరి పోలీసులను ఆశ్రయించారు.
కాగా ఈ వ్యవహరంలో తన ప్రమేయం ఏమీ లేదని నిర్మాత బెల్లంకొండ సురేష్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇరు వర్గాలపై పంజగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్మాత బెల్లంకొండ సురేష్‌ను, ప్రదీప్ చౌదరిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. హలో చ్తిత్రం రీమేక్ నా స్టైలే వేరు లో రాజశేఖర్,భూమిక నటించారు. దానని జి.రామప్రసాద్ డైరక్ట్ చేసారు. సినిమా భాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.
మరిన్ని వివరములు:
రాజశేఖర్
బెల్లంకొండ సురేష్
భూమిక
సంబంధిత వార్తలు