clear
clear
clear
clear
x

జోష్ హీరోయిన్ కార్తీక నగ్నంగా కనిపిస్తుందా?

  శుక్రవారం, నవంబర్ 6, 2009, 14:58[IST]
Vote this article
Up  
Down  


నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కార్తీక(రాధ కూతురు) గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా 'మకరమన్జు'అనే మళయాళ చిత్రం కమిట్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి ఓ స్పెషాలిటి ఉంది. ఈ చిత్రం ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ఇదే కథాశంతో హిందీలో రంగ్ రసియా పేరుతో కేతన్ మెహతా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. అందులో కీలకపాత్రను నందనా సేన్ పోషిస్తోంది. ఆ పాత్రకు ఓ ప్రత్యేక ఉంది. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించాలి. ఆమె ను మోడల్ గా తీసుకుని రవివర్మ పెయింటింగ్ చేసే సీన్స్ అవి. ఆ సీన్ విని చాలామంది హీరోయిన్స్ వెనకడగు వేసారు. అయితే నందనాసేన్ రావటంతో ఇబ్బంది తొలిగి క్రేజ్ వచ్చింది.

ఇప్పుడు మళయాళంలో కార్తికకు వచ్చిన పాత్ర కూడా అలాంటిదే కావటంతో ఆమె కూడా నగ్న సన్నివేశాల్లో చేస్తుందా అని సందేహాలు పరిశ్రమలో కలుగుతున్నాయి. ఇక ప్రముఖ ఛాయా గ్రాహకుడు సంతోష్ శివన్..ఈ చిత్రంలో కీలకమైన రవివర్మ పాత్రను చేస్తున్నారు. లెనిన్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహిస్తారు. ఇటీవలే శివన్‌, కార్తీకపై ఫొటో షూట్‌ చేశారు. వచ్చే వారంలో చిత్రీకరణ మొదలవుతుంది. "నటన అనేది పూర్తిగా కొత్త. సంవత్సరం నుంచి రాజేంద్రన్‌ నటించమని పట్టుబడుతున్నారు. ఆయన పక్కాగా ఈ కథను తయారుచేసుకున్నారు" అన్నారు సంతోష్‌ శివన్‌.ఇక కార్తీక కూడా చాలా హ్యాపీగా ఉంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: కార్తీక్
తేదీ: 09 Nov 2009 10:24 am
తెరవెనుక నగ్నంగా తిరుగుతారు ఇక తేరా పై కూడా నగ్నంగా కనిపిస్తున్నారు హ హ హ్హ

[ Post Comments ]
  Other News
  Videos