clear
clear
clear
clear
x

అందరికీ షాకిస్తున్న ఇలియానా ఫ్యాన్ క్లబ్

  గురువారం, నవంబర్ 19, 2009, 17:02[IST]
Vote this article
Up  
Down  


ఇలియానాకు తమిళనాడులోని మధురై లో ఫ్యాన్ క్లబ్ వెలిసింది. అయితే స్టార్ హీరోయిన్స్ ఫ్యాన్ క్లబ్ లు వెలవటం కొత్తేమీ కాదు కానీ ఒకే ఒక్క సినిమా అదీ ఫ్లాప్ సినిమా చేసిన హీరోయిన్ కు ఫ్యాన్ క్లబ్ పెట్టడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె కేడీ అనే తమిళ చిత్రంలో చేసింది. రవికృష్ణ హీరోగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని పొందింది. ఆ తర్వాత ఆమె పూర్తి స్దాయిలో తెలుగులో కాన్సర్టేట్ చేయటంతో తమిళంలో చిత్రాలు కమిట్ కాలేదు. ఆ మధ్య విక్రమ్ సరసన 24 అనే చిత్రం ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత డేట్స్ ఎడ్జెస్టు కావని సారీ అంది. దాంతో తమిళంలో ఒక్క సి నిమా చేయని ఆమె అంటే అభిమానం ఏమిటా అంటే...తెలుగు డబ్బింగ్ సినిమాల ఎఫెక్టు అని తేలింది. ఇక తమన్నా అక్కడ వెలుగుతున్నా ఎవరూ ఆమెకు గుడిగానీ, ఫ్యాన్ క్లబ్ కానీ పెడతామనలేదు. దాంతో ఈ విషయం తెలుసుకున్న తమిళ నిర్మాతలు తమ యువత..ఇలియానాను ఎంతగా ఆరాధిస్తున్నారో అర్ధం చేసుకుని ఆమెను తమ సినిమాల్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాబట్టి ఇలియానా డిమాండు పెర్గి త్వరలోనే రేటు పెంచవచ్చు. ప్రస్తుతం ఇలియానా ..విష్ణు సరసన సలీం చిత్రంలో చేస్తోంది. ఇంతకుముందు ఆమె నితిన్ సరసన చేసిన రెచ్చిపో చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.తాజాగా రామ్ సరసన టామ్ అండ్ జెర్రీ చిత్రంలో చేస్తోంది. స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేంద్రరెడ్డి డైరక్ట్ చేస్తున్నారు. రామ్, ఇలియానా కాంబినేషన్ లో గతంలో దేవదాసు చిత్రం వచ్చి హిట్టయింది. అలాగే సురేంద్రరెడ్డితో ఆమె రవితేజ సరసన చేసిన కిక్ కూడా బాక్సాఫీస్ ను కుదిపేసింది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: శ్రీనివాస్
తేదీ: 20 Nov 2009 8:25 am
దీనికి ఫోజులు ఎక్కువ సైజులు తక్కువ.దాని దగ్గర ఏముందని ఎగ బద్తున్నరురా ?

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...