clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » అవీ ఇవీ » పూర్తి కథ

వైవియస్ చౌదరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్!?

  శుక్రవారం, నవంబర్ 13, 2009, 10:43[IST]
Vote this article
Up  
Down  


నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో వైవియస్ చౌదరి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మేరకు 'సలీం' ఆడియో ఫంక్షన్ లో ప్రకటన చేసారు. 'జయీభవ' పరాజయం అనంతరం కళ్యాణ్ రామ్ అబిమన్యు మల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. మల్లి రీసెంట్ గా శ్రీహరితో భద్రాద్రి చిత్రం చేసారు. కానీ అది భాక్సాఫీస్ ని మెప్పించలేకపోయింది. ఇక ఈ ప్రాజెక్టుకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నాడు. అలాగే వైవియస్ చౌదరి ప్రాజెక్టు కూడా అతి త్వరలోనే పూజ జరుపుకోనుంది. ఈ మేరకు కళ్యాణ్ రామ్ కి ఓ స్టోరీ లైన్ ని నేరేట్ చేసి ఒప్పించినట్లు సమాచారం.అలాగే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై చేసే అవకాశం ఉంది.ఇక ప్రస్తుతం వైవియస్ చౌదరి డైరక్ట్ చేస్తున్న సలీం చిత్రం త్వరలో విడుదల కానుంది. అందులో మంచు విష్ణు వర్ధన్, ఇలియానా జంటగా చేస్తున్నారు. చౌదరి ..ఒక్క మగాడు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...