clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » అవీ ఇవీ » పూర్తి కథ

ముద్దు మ్యాటర్ లో గొడవై బయిటపడ్డ నిఖిత

  సోమవారం, నవంబర్ 2, 2009, 19:46[IST]
Vote this article
Up  
Down  


సంబరం ఫేమ్ నిఖిత తాజాగా ఓ ముద్దు గొడవ మొదలెట్టింది. అది పెరిగి పెద్దదై చివరకు ఆ సినిమా నుంచి బయటకు వస్తే పరిస్ధితి తీసుకొచ్చింది. కన్నడంలో ఆమె ప్రస్తుతం 'ఎకె 56' అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం ద్వారా సిద్దార్థ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. డైరక్టర్ ఓంప్రకాష్‌ చెప్పిన కథ బాగా నచ్చడంవల్ల కొత్త హీరో అయినా నటించడానికి నిఖిత పచ్చజెండా ఊపారు. అయితే.. షూటింగ్‌ సమయంలో హీరోతో ముద్దు సన్నివేశంలో నటించాలని నిఖితతో ఓంప్రకాష్‌ చెప్పారట. దాంతో గొడవ మొదలైంది. ఆమె ఆ చిత్రం నుంచి వాకౌట్‌ చేశారు.

ఆ విషయం మీడియాతో చెబుతూ - "కథ నచ్చడంతో కొత్త హీరో సరసన చేయడానికి సిద్ధపడ్డాను. చర్చలు జరిపినప్పుడు ముద్దు సన్నివేశం గురించి దర్శకుడు నాతో చెప్పలేదు. ఇది యాక్షన్‌ చిత్రం కావడంతో నీ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందని ఓంప్రకాష్‌ అన్నారు. అయినా నేను అభ్యంతరం తెలుపలేదు. నిడివి తక్కువగా ఉంది కాబట్టి ముద్దు సన్నివేశం పెడితే హైలైట్‌ అవుతుందన్నప్పుడు మాత్రం ఆలోచనలో పడ్డాను. కేవలం అదనపు ఆకర్షణ కోసం అలాంటి సన్నివేశంలో నటించడానికి నేను ఇష్టపడలేదు. కథకి సంబంధమే లేకుండా సన్నివేశాలు పొందుపరిస్తే బాగుంటుందా?' అన్నారు నిఖిత.

ఇక లాస్ట్ మినిట్ లో ఆమె తప్పుకోవడంతో దర్శకుడు వేరే కథానాయికని వెతుక్కునే పనిలో పడ్డారు. నిజానిరి నిఖితకి ఇప్పుడు చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. దాంతో అనవరసంగా చిన్న ఇష్యూని పెద్దది చేసారంటూ ఆమెనే అంతా అంటున్నారట. అదీ సంగతి.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos