clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » అవీ ఇవీ » పూర్తి కథ

మహేష్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్లో చిత్రం!?

  బుదవారం, నవంబర్ 4, 2009, 17:53[IST]
Vote this article
Up  
Down  


త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఖిలాడి చిత్రం షూటింగ్‌లో మహేష్‌ బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటింపజేయాలని ప్రముఖ నిర్మాత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మగధీర అనంతరం సునీల్ తో చేస్తున్న మర్యాద రామన్న కామిడీలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం ఈ ప్రాజెక్టు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళి, మహేష్‌ బాబుల కలయికలో చిత్రం నిర్మాణం జరిగితే తెలుగులో అత్యధిక వ్యయంతో తెరకెక్కే చిత్రం ఇదే అవుతుందని విశ్లేకులు చెబుతున్నారు. వ్యాపార పరంగా కూడా ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.ఇక త్రివిక్రమ్ చిత్రంలో మహేష్ సరసన అనూష్క చేస్తోంది. పులి చిత్రాన్ని నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్ కి ఈ చిత్రం ధియోటర్స్ లో ఉంటుంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: cheery
తేదీ: 09 Nov 2009 6:54 pm
mahesh babu gadu pokire elago hit aindhi ipudu vidu pokire la film testhe chalo so vidukuda comption sarpothdu vedi makumki magadheera record kalo kuda jargadhu

పోస్ట్ చేసినవారు: రంజిత్
తేదీ: 05 Nov 2009 2:48 pm
గని! నువ్వు ఈ లోకంలోకి రా! పోకిరి రికార్డు బద్దలయ్యి 65 డేస్ అయ్యింది. పోకిరి గ్రాస్ ని మగధీర 30days కే క్రాస్ చేసింది. ఇక సెంటర్స్ విషయానికి వస్తే నాలుగు రోజులు ఆగు. 223 సెంటర్స్ లో 100 డేస్. జూబ్లీ కూడా కొడుతుంది. మగధీర రికార్డ్స్ కొట్టాలంటే సచిన్ వన్డే రికార్డ్స్ బద్దలు కొట్టే వాడు వచ్చినప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు మూసుకు కూర్చో.

[ Post Comments ]
  Other News
  Videos