ప్రేమ అశాశ్వతం అంటున్న కత్రినా కైఫ్
గురువారం, నవంబర్ 5, 2009, 19:11[IST]
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని కత్రినా కైఫ్ చెబుతోంది. ముఖ్యంగా ప్రేమ. ఆమె మట్లాడుతూ ‘సినిమాల్లో విజయాలు సొంతం చేసుకోవడం సులభమేగానీ ప్రేమను చివరి దాకా నిలుపుకోవడం అంత సులభంకాదు. ప్రేమించడం కోసం ఎంతో కష్టపడాలని చాలా మంది చెబుతుంటారు. కానీ ప్రేమ కోసం కష్ట పడుతున్నామనే భావన మదిలో రావడం మంచిది కాదు. ఎందుకంటే అలా అనుకున్నపుడు అందులో ఆనందం ఉండదు. అందుకే నా దష్టిలో ప్రేమ కోసం ఎవరూ కష్టపడనవసరం లేదని తేల్చేసింది. ఇంతకీ కత్రినాకి ఎందుకీ వైరాగ్యం??
మరిన్ని వివరములు:
కత్రినా కైఫ్
ప్రేమ
సల్మాన్ ఖాన్
సంబంధిత వార్తలు