ప్రపంచంలోనే అతి చవకైన కారుగా పేరుగాంచిన టాటా మోటార్స్ వారి నానో కారును గత ఏడాది బుక్ చేసుకోలేకపోయారా. మరేం పర్లేదు ఈ ఏడాది మరో సారి బుకింగులను ఆహ్వానిస్తోంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ సంస్థ వర్గీయుల కథనం ప్రకారం ఈ ఏడాది డిసెంబరు నెలలో ఈ కార్ల బుకింగులు మొదలవనున్నాయి. మొదటి బుకింగులో 100,000 కు పైగా వినియోగదారులు కార్లను బుక్ చేసుకున్నారు. ఇంకా వీరిలో కొందరికి కార్లు అందాల్సి వుంది. లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన వారికి తొలుత కార్లను అందజేస్తున్నారు.
తొలిసారి బుక్ చేసుకున్న వారిలో ఇంకా అందరికీ కార్లు అందకపోయినా పంత్ నగర్, ఉత్తరాఖండ్ లో వున్న నానో ప్లాంట్ లకు తోడు, ఇటీవలే సనంద్ ప్లాంట్ లో కూడా కార్ల రూపకల్పణ షురూ అవ్వడంతో ఈ రెండవ బుకింగుకు వెళ్తున్నట్టు తెలిసింది. డిసెంబరు లోపు తొలి సారి బుక్ చేసుకున్నవారందరికి కార్లను అందజేసి, ఆ తర్వాత ఈ రెండవ ధపా బుకింగులను పరిశీలించాలని టాటా మోటార్స్ భావిస్తోంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే డిసెంబరు నాటి బుకింగుకు సిద్ధంగా వుండండి.
మరిన్ని వివరములు:
టాటా మోటార్స్
నానో
టాటా ఇండిగో మాంజా
సంబంధిత వార్తలు