హోండా మోటార్స్ కంపెనీ వారి CR-V ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన CR-V కొత్త మోడల్ కు కూడా మంచి ఆదరణ లభించింది. తాజా ఇదే కోవలో హోండా మోటార్స్ సరికొత్త CR-V మోడల్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం చెలామణీ అవుతున్న CR-V మోడల్ కారు మోడల్ కు మార్పులు చేసి విడుదల చేసిన ఈ కారు మోడల్ ఎంతో ఆకర్షణీయంగా వుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటీరియర్ డిజైన్ ప్రస్తుతం మార్కెట్ లో వున్న CR-V కారునే పోలివుంది. ప్రస్తుత CR-V కారుకు ఉపయోగించిన 2.0 L-MT 2WD మరియు 2.4L-MT / AT Real-time 4WD ఇంజన్ నే ఈ కొత్త మోడల్ కారుకూ ఉపయోగించారట. ఇందులో అధనంగా ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు, అధునాతన ఓపిడియస్ (OPDS: Occpant Position Detection System) టెక్నాలజీని ఉపయోగించారు. అంతే కాకుండా అధునాతన మ్యూజిక్ సిస్టమ్, యు.యస్.బి. ఈ కారుకి ప్రధాన ఆకర్షణ.
ఢిల్లీ లో వివిధ CR-V మోడళ్ల ఎక్స్ షో-రూం ధరలు ఈ విధంగా వున్నాయి:
మోడల్ ధర
హోండా CR-V 2.0L-MT Rs. 21,92,000/-
హోండా CR-V 2.4L MT Rs. 23,37,000/-
హోండా CR-V 2.4L AT Rs. 24,12,000/-
మరిన్ని వివరములు:
సంబంధిత వార్తలు