ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రల రాజధానిగా ఒంగోలు సముచితంగా ఉంటుందని ఒక అభిప్రాయం ఇటీవల బలంగా విన్పిస్తోంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో సచివాలయం, హైకోర్టు, తదితర భవన సముదాయాలకు ఒంగోలు వద్ద అనుకూలమని అంటున్నారు. విజయవాడ, గుంటూరులలో అంత భూమి లేదు. పైగా విజయవాడ నగరం ఇప్పటికే బాగా ఇరుకైపోయింది. ఒంగోలుకు మరో ప్లస్ పాయింట్ రాయసీమ జిల్లాలకు దగ్గరగా ఉండడం. అందమైన నల్లమల అడవుల్లో కొంతభాగం ఒంగోలు జిల్లాల్లో ఉన్నాయి.
ఆరొందల ఏళ్ళ క్రితమే భవిష్యవాణి విన్పించి ప్రపంచం మొత్తాన్ని నిశ్చేస్టులను చేసిన వీర బ్రహ్మం గారు ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న చీమకుర్తి గ్రామం చెన్నై(ఆనాటి మదరాసు) అంత అవుతుందని జోస్యం చెప్పారు. ప్రపంచశ్రేణి గ్రానైట్ గనులు చీమకుర్తిలో ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని ఒంగోలుకు చీమకుర్తికి మధ్య మహానగరం రానుందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల రేట్లు భాగా పెరుగుతున్నాయి.
మరిన్ని వివరములు:
సంబంధిత వార్తలు