పవన్ కల్యాణ్ ఈమధ్య తనదైన సినిమా లోకంలోనే ఉంటున్నారు. అన్న చిరంజీవిపై మోహన్ బాబు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేసినా ఆయన ప్రతిస్పదించలేదు. ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర"లో పవన్ కల్యాణ్ పాత్ర ఉందని తెలిసినా ఆయన కామ్ గా ఉంటున్నారు. ఆ పాత్ర పరిటాల రవి మనుషుల చేతిలో చిక్కి గుండు చేయించుకున్న ఒక అమాయక యువకుడిది. వదంతుల ప్రకారం చాలా ఏళ్ల క్రితం ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో పరిటాల మనుషులు తమకు అడ్డు పడ్డాడని పవన్ కు గుండు చేయించి పంపారట.
రామ్ గోపాల్ వర్మ టాలెట్స్ మీద పవన్ కు ఎంతో గౌరవం ఉందని చెబుతారు. అలాగే పవన్ క్రియేటివిటీ వర్మకు నచ్చుతుంది. ఇద్దరూ మాట్లాడుకుని ఆ ఒక్క సీన్ ను కట్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని బ్లాగుల జనం మొత్తుకుంటున్నారు. అయితే ఆ సీన్ ఇప్పటికే షూట్ అయినట్టు తెలుస్తోంది. అచ్చంగా పవన్ లాగా ఉన్న యువకుడు ఆ సీన్ లో నటించినట్టు చెబుతున్నారు. తను స్వయంగా వర్మతో మాట్లాడకపోయినా అన్న చిరంజీవికి చెప్పి ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు కదా అని ఆయన అభిమానులు బ్లాగ్ లలో వాపోతున్నారు. అయినా ఆ సినిమాలో గూండాల చేతిలో గుండు కొట్టించుకున్న యువకుడి పాత్ర అవసరమా? ఆ పాత్ర లేకుండానైనా సినిమాను వర్మ రక్తి కట్టించగలరు.
మరిన్ని వివరములు:
పవన్ కల్యాణ్
రక్త చరిత్ర
మోహన్ బాబు
సంబంధిత వార్తలు