clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

వర్మ సిన్మాకు అడ్డంకులు?

  శుక్రవారం, జూన్ 19, 2009, 14:36[IST]
Ram Gopal Varma
Vote this article
Up  
Down  


రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర" కోసం మరికొన్ని నెలలు వేచి ఉంటే బాగుండేది. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా వర్మ ఈ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రక్త చరిత్రను రెండు భాగాల సినిమాగా వర్మ రూపొందిస్తున్నారు. అయితే పరిటాల రవి హత్య వెనుక ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల వర్మ టేకింగ్ వల్ల తాము ఎక్కడ ప్రజల్లో అప్రదిష్టపాలవుతామోనన్న భయం జిల్లా కాంగ్రెస్ నాయకులకు పట్టుకుంది. అందువల్ల ముఖ్యమైన కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా వర్మకు వార్నింగ్ సంకేతాలు వెళ్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను విరమించుకోవలసిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్నింగ్ లను వర్మ పత్రికా ప్రకటనల ద్వారా తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి. ఆ విషయంలో వర్మ దిట్ట. ఈ కథలో మొద్దు శీను ఒక ప్రధాన పాత్ర కావాలి. కానీ మొద్దు శీను కొందరి చేతిలో కీలు బొమ్మ అన్న విషయం అందరికీ తెలిసిందే. మొద్దు శీనును లేపేశానని చెబుతున్న వ్యక్తి ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ ట్విస్ట్ లను వర్మ ఎంత సమర్ధంగా తీస్తాడో, అసలు తీయకుండా ఉంటాడో చూడాలి.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రాజేంద్ర ప్రసాద్
తేదీ: 22 Jun 2009 11:56 am
వర్మ గారు జీనిఎస్ . సర్కార్ రాజ్ లో బాల థాకరే నేపథ్యాన్ని దెబ్బ తీయకుండా మహారాష్ట్ర స్టేట్ ని , హిందీ ప్రేక్షకులని మెప్పించిన దిగ్గజం తను. ఇక ఒక ప్రాంతమునకు పరిమితమైన నేతని అవమాన పరుస్తారని భావించ కూడదు. వర్మ మచ్చుర్డ్ క్రియేటివ్. రాయలసీమ గొప్పదనాన్ని జాతీయ స్థాయికి తీసుకువేలుతున్నదుకు తెలుగు వాళ్ళగా ఆయనని ప్రోత్సహించాలి మనం.

పోస్ట్ చేసినవారు: gudda paguluddi
తేదీ: 20 Jun 2009 8:16 am
Maa daivam Paritaala anna ki anti ga unte,neeku moodinde

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...