clear
clear
clear
clear
x
హోంపేజి » లోగుట్టు » పూర్తి కథ

రాజకీయాల వేడి జెపికి ఇప్పుడు తెలుస్తోంది

  బుదవారం, నవంబర్ 4, 2009, 8:52[IST]
Jayaprakash Narayan
Vote this article
Up  
Down  


లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణపై సొంత పార్టీలోనే విమర్శలు ప్రారంభమయ్యాయి. రాజకీయ పార్టీని నడపడమంటే పులిమీద స్వారీ లాంటిదని చిరంజీవి లాగానే ఆయనా గ్రహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టికెట్ల పంపకం విషయంలో జయప్రకాష్ నారాయణ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులే జనాంతికంగా విమర్శిస్తున్నారు. ఎన్నో మంచి ఆశయాలతో ఆవిర్భవించిన లోక్ సత్తాకు కాంగ్రెస్, టిడిపి వంటి ధనస్వామ్య, భూస్వామ్య పార్టీలకు తేడా లేకుండా పోయిందని జెండాలు మోసిన లోక్ సత్తా నాయకులు వాపోతున్నారు.

జయప్రకాష్ నారాయణ అతి తెలివి వల్లనే ఇబ్బందులు వస్తున్నట్టు తెలుస్తోంది. తాను కమ్మ కులానికి చెందినా తనకు కులాభిమానం లేదని చెప్పుకోడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. తాను తెలుగుదేశానికి బద్ధ వ్యతిరేకినని చెప్పుకోడానికి ఆయన పరోక్షంగా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రశంసించారు. కాంగ్రెస్ ను ఆయన మెచ్చుకోవడం హార్డ్ కోర్ లోక్ సత్తా వాదులకు నచ్చడం లేదు. పైగా ఆయనది ఐఎఎస్ స్టైల్. వచ్చిన కార్యకర్తలతో సామూహికంగానైనా ఒక నిముషం మాట్లాడడానికైనా ఆయన సిద్ధంగా ఉండరన్న విమర్శ ఉంది. తన మీద వచ్చే విమర్శలను ఆయన సహృదయంతో స్వీకరించరన్న ఆరోపణ కూడా ఉంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: జపీ ఫాన్స్
తేదీ: 05 Nov 2009 10:01 pm
ఇప్పటకి జపీ మాత్రమే ఒక్క మగాడు. జపీ కీప్ ఇట్ అప్ .

పోస్ట్ చేసినవారు: ryt
తేదీ: 05 Nov 2009 9:30 pm
JP గారు ఇవ్వాల కొత్తగా రాజకీయాలలో డబ్బు ప్రభావం ఏమిటో తెలుకోవాలా? కొన్ని దశాబ్దాలు గా చెబుతున్నారు JP గారు దీని మీద.

[ Post Comments ]
  Other News
  Videos