clear
clear
clear
clear
x
హోంపేజి » లోగుట్టు » పూర్తి కథ

అల్లు అరవింద్ పాచిక

  సోమవారం, నవంబర్ 2, 2009, 17:27[IST]
Allu Aravind
Vote this article
Up  
Down  


అల్లు అరవింద్ మళ్ళీ రాజకీయ పాచికలు వేస్తున్నారు. తనకు రాజ్యసభ సభ్యత్వం, తర్వాత కేంద్ర మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కు ఆయన ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైతే చిరంజీవి కాంగ్రెస్ కు ప్రచార సారధిగా ఉపయోగపడతారని అల్లు ఆశ పెట్టారట. ఆయన చిరంజీవితో ఫోన్ లో మాట్లాడి ఆయన అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ ప్రతిపాదన చేసినట్టు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే వైఎస్ లేని కాంగ్రెస్ కు చిరంజీవి ప్రధాన ఆకర్షణ అవుతారు.

గత ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని చిరంజీవిని కట్టడి చేసింది అరవిందే. ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేస్తే బాగుంటుందని వత్తిడి చేస్తున్నదీ అరవిందే. అల్లు ప్రతిపాదనపై డి.శ్రీనివాస్ లౌక్యంగా స్పందించడం విశేషం. ముందస్తు షరతులు కాకుండా మొదట కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి ఆ తర్వాత వివరాలు మాట్లాడుకుందామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు అరవింద్ ఒప్పుకుంటారా? హై కమాండ్ నుంచి ఖచ్చితమైన హామీ లభిస్తేనే ఈ విలీనం సాధ్యమయ్యేలా ఉంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: శిరం
తేదీ: 03 Nov 2009 7:04 pm
వీడు చిరు ని కాంగ్రెస్ కి అమ్ముతున్నాడు ...రేట్ ఫిక్స్ చేసాడు

పోస్ట్ చేసినవారు: రంజిత్
తేదీ: 03 Nov 2009 2:13 pm
ప్రజా రాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి. రెండు రాజ్య సభ సీట్లు వచ్చినట్టే. ఈ ఆర్టికల్ బుర్ర లేనివారు రాసి వుంటారు.

[ Post Comments ]
  Other News
  Videos