రాహుల్ షాడో పిఎం?కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ షాడో ప్రధానిగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆయన తలదూర్చి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని అంటున్నారు. చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ జోక్యం వల్లనే సమస్య పరిష్కారమైందని కాంగ్రెసు పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. మీడియా కథనాలు కూడా అలాగే...
'గ్రేటర్' ఫైట్గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్,..
చిరు 'కుల' ఎజెండాప్రజారాజ్యం అధినేత చిరంజీవి సామాజిక న్యాయ సాధన గోలనే రాజకీయాల్లో వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుల ప్రాతిపదికపై సామాజిక న్యాయాన్ని సాధించాలనే రాజకీయ సూత్రీకరణను అమలు పెట్టడంలో ఆయన విఫలమయ్యారని అంటారు. సైద్ధాంతికంగా అది బాగానే కనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అది ఫలితాలు సాధించడంలో పనికి రావడం లేదని చెబుతారు. అయితే దాన్ని సృజనాత్మకంగా..
రామోజీపై జగన్ ఎదురుదాడిమూడేళ్ల క్రితం రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్స్ అక్రమంగా డిపాజిట్లు సేకరించిందంటూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. అప్పటి నుంచి ఇటీవలి దాకా ఆయన రామోజీపై సమరం సాగిస్తూనే వచ్చారు. దీంతో రామోజీరావు డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితిలో పడినప్పుడు నిమేష్ కంపానీ ముందుకొచ్చి ఆదుకున్నారని సాక్షి దిన పత్రిక రాసింది. 2007..
బాబు టార్గెట్ వైయస్ జగన్తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై తలపెట్టిన ఆందోళనను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పైనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురంలో అక్రమంగా తవ్వకాల ద్వారా గాలి జనార్దన్ రెడ్డి పది వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తున్న..
ఎవరీ 'గాలీ'?న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాపై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో, కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వానికి వైయస్ జగన్ పక్కలో బల్లెంలా మారిన పరిస్థితిలో ఓబుళాపురం గనుల వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం సహా ప్రతిపక్షాలు ఓబుళాపురం గనుల అక్రమాలపై తీవ్ర స్థాయిలో..
తండ్రిని మించని తనయుడుహైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత కాంగ్రెసు నేత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తారా. అంత ఓపిక, సహనం జగన్ కు ఉన్నాయా. వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న రాజకీయ చతురత ఆయనకున్నాయా. ఇవన్నీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు. తండ్రులు అత్యున్నత స్థానాలకు ఎదిగితే..
జెపిపై బాబు కోపం వెనక..హైదరాబాద్: లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. తమ పార్టీ ఓట్లకు లోకసత్తా గణనీయంగా గండి కొడుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. అందుకే జెపిపై ఆయనకు కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. శాసనసభ, లోకసభ ఎన్నికల్లో లోకసత్తా వల్లనే ఉత్తరాంధ్రలోని పలు..
డైలమాలో రోజా, విజయశాంతిహైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఇద్దరు తారలు డైలమాలో పడ్డారు. కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడిన విజయశాంతి, రోజా ప్రస్తుతం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న రోజా ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేయకపోయినా కాంగ్రెసులో..
కెసిఆర్ కు 'గ్రేటర్' గుదిబండహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు గుదిబండగా మారాయి. ఎన్నికల్లో పాల్గొనాలా, లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడం ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కెసిఆర్ కు కట్టబెడుతూ పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయం చేసింది. ఇప్పుడు తేల్చాల్సిందే కెసిఆరే...